: సిగ్గులేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు కాలర్ పట్టుకుని నిలదీస్తాం: వైఎస్ జగన్


రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా కోసం కేవలం బెంచీలను ఎక్కి నిరసనలు తెలపడంతోనే వైకాపా ఆగబోదని, హోదా వల్ల ప్రయోజనాలు ఉండవని సిగ్గులేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కాలర్ పట్టుకుని కూడా నిలదీస్తామని విపక్ష నేత వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన పిలుపుపై శనివారం నాడు రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నిరసనను విఫలం చేయాలని ప్రభుత్వం చూసిందని, కానీ కోట్లాది మంది ప్రజలు తమ మనసులోని అభిప్రాయాన్ని బంద్ కు సహకరించి తెలిపారని అన్నారు. హోదా ఇవ్వడం లేదని అరుణ్ జైట్లీ చెబితే, ఆ వ్యాఖ్యలను చంద్రబాబు స్వాగతించారని, హోదా పొందిన ఈశాన్య రాష్ట్రాలు బాగుపడలేదని అనడం ఆయన మానసిక స్థితిని తెలుపుతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News