: తారక్ కాంబినేషన్లో నాకు బ్లాక్ బస్టర్ హిట్టు ఇస్తానని దర్శకుడు అప్పుడే చెప్పారు!: సమంత
తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ విజయాన్ని 'జనతా గ్యారేజ్'తో ప్రేక్షకులు ఇచ్చారని సమంత ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. 'జనతా గ్యారేజ్'కు పనిచేసిన టీం చాలా మంచిదని, అలాంటి వారికి మంచి జరగాలని, ఈ సినిమాతో అలాంటి మంచే జరిగిందని సమంత తెలిపింది. ఈ కథ చెప్పినప్పుడే తారక్ కాంబినేషన్లో తనకు బ్లాక్ బస్టర్ హిట్టును ఇస్తానని దర్శకుడు శివ మాట ఇచ్చారని, ఆయన మాటతప్పలేదని ఆమె తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ విజయానికి అర్హుడని, ఆయనకు సరైన సమయంలో సరైన హిట్ గా 'జనతా గ్యారేజ్' నిలిచిందని సమంత తెలిపింది. ఈ విజయంతో తామంతా చాలా ఆనందంగా ఉన్నామని సమంత తెలిపింది.