: ప్లైట్ లో శీర్షాసనం వేసి అందర్నీ బెంబేలెత్తించిన యువతి


బస్సుల్లోనో, రైళ్లలోనో ప్రయాణం అంటే, చుట్టూ పరిసరాలను చూస్తూ కాలం వెళ్లబుచ్చవచ్చు. మరి విమాన ప్రయాణం అంటే, అలా కుదరదు కదా, అందుకే ఓ మహిళ తనకు తోచిన పని చేయడం ప్రారంభించింది. దీంతో అంతా బిత్తరపోయారు. లాస్‌ ఏంజిల్స్‌ నుంచి కాబో సాన్‌ లుకాస్‌ కు వెళుతున్న విమానంలో ఓ మహిళ చుట్టూ ప్రయాణికులంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ...తన సీట్లో శీర్షాసనం వేసే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నాన్ని పసిగట్టిన పలువురు ఆందోళనతో ఎయిర్ హోస్టెస్ కి ఫిర్యాదు చేయగా, ఆమె ప్రశ్నించడంతో... తనకు నలతగా ఉందని, దాని నుంచి ఉపశమనం కోసం చిన్నచిన్న యోగాసనాలు వేసుకుంటానని తెలిపింది. ఇది సహ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుందంటే మానేస్తానని కూడా తెలిపింది. దాంతో అలా చేయవద్దని సూచించి, ఎయిర్ హోస్టెస్ వెళ్లిపోయింది. ఈ వెంటనే ఆమె మళ్లీ తన సీట్లో శీర్షాసనం వేసే ప్రయత్నం చేసింది. దీనిని రీడ్‌ మొబ్రెస్‌ అనే సహ ప్రయాణికుడు సెల్‌ ఫోన్‌ లో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. దానిని మీరు కూడా చూడవచ్చు.

  • Loading...

More Telugu News