: న్యూజిలాండ్ టూర్ కోసం హెయిర్ స్టైల్ మార్చేసిన విరాట్ కోహ్లీ
కేవలం ఆటతీరుతోనే కాకుండా, లుక్స్ తో కూడా విరాట్ కోహ్లీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి సిరీస్ కి డిఫరెంట్ లుక్ తో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. యూరోపియన్ ఫుట్ బాల్ ఆటగాళ్లను అమితంగా అభిమానించే కోహ్లీ...అచ్చం వారిలానే డిఫరెంట్ హెయిర్ కట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. దానికి తోడు ప్రియురాలికి ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలన్న తాపత్రాయం కూడా ఇలా ఫ్యాషన్ మార్పుకు కారణమే. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అపెనీ జార్జ్ చేత న్యూలుక్ ట్రై చేశాడు. గతంలో అపాచీ కట్ తో కనిపించిన కోహ్లీ...ఈ సారి మధ్యలో జుత్తును స్ట్రెయిట్ నింగ్ చేయించుకుని దగ్గరకు కత్తిరించుకున్నాడు. ఈ లుక్ లో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశాడు. కాగా, ఈ మధ్యే ముంబైలో ర్యాంప్ వాక్ నిర్వహించిన యువరాజ్ సింగ్ కూడా ఆమె వద్దే హెయిర్ స్టైల్ చేయించుకుని ర్యాంప్ పై నడిచి ఆకట్టుకున్నాడు.