: మరియప్పన్‌కు రూ.2 కోట్ల నజరానా ప్రకటించిన జయలలిత ప్రభుత్వం
బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో హైజంప్ ఈవెంట్ లో ఇండియాకు చెందిన మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించిన విషయం విదితమే. ఆయన 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఆయనకు తమిళనాడు సర్కారు రూ.2 కోట్ల నజరానా ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేకంగా మరియప్పన్ కు అభినందనలు తెలిపారు. ఇదే ఈవెంట్ లో భారత్ కే చెందిన మరో క్రీడాకారుడు వరుణ్ సింగ్ భాటి కాంస్య పతకాన్ని సాధించాడు. వీరిరువురికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ముందుగా ప్రకటించిన ప్రకారం కేంద్రం పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలుకు రూ.75 లక్షలు, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భాటికి రూ.30 లక్షలు అందించనుంది.