: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు


తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ఆత్మ‌కూరు, రేగొండ‌, తొర్రూరు, పాల‌కుర్తి, మ‌హ‌బూబాబాద్ మండ‌లాల్లో ఈరోజు ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు జిల్లాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డుతోంది. వాయవ్య బంగాళాఖాతంలో రేపు ఉదయానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరుజల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు ప‌డ‌తాయ‌ని పేర్కొంది. మూడు రోజుల తరువాత తెలంగాణ‌లో క్రమంగా వర్షాలు పెరుగుతాయని తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీగా వ‌ర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News