: తిరిగి ప్రారంభమైన శాసనసభ.. రోజా క్షమాపణ లేఖను సభ ముందు పెట్టిన స్పీకర్
పది నిమిషాల వాయిదా తరువాత ఏపీ శాసనసభ తిరిగి ప్రారంభమైంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా సమర్పించిన క్షమాపణ లేఖను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభ ముందు పెట్టారు. అయితే, ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి గందరగోళం సృష్టిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. సభాపతి పోడియంపై ఉన్న బల్లలపైకి ఎక్కి వైసీపీ నేతలు ఆందోళన తెలుపుతున్నారు. దీంతో సభ ముందుకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.