: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దే బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు వైసీపీ నేతల తీరుపై టీడీపీ అసహనం వ్యక్తం చేస్తోంది. వైసీపీకి సమస్యలపై చిత్తశుద్ధిలేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ నేతలే ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరికాసేపట్లో గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగుతామని వైసీపీ నేతలు అంటున్నారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.