: రాజకీయాలకు ఉండవల్లి గుడ్ బై!... స్వయంగా ప్రకటించిన మాజీ ఎంపీ!
తెలుగు నాట సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్... పాలిటిక్స్ కు స్వస్తి చెప్పారట. రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఉండవల్లి... ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చిన ఆయన వైసీపీ వైపు చూశారు. వైసీపీలో ఉండవల్లి చేరికకు కార్యరంగం సిద్ధమైపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నానని ఉండవల్లి ప్రకటించారు.