: పవన్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తాం: మంత్రి గంటా
ఈరోజు జరిగిన కాకినాడ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులతో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపక్షనేతగా పనికిరారని, ఆ పదవిని మరొకరికి ఇస్తే బాగుంటుందని అన్నారు. జగన్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ఈ నెల 14న విశాఖపట్టణంలోని బ్రిక్ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.