: మా వీధిలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయండి: క్రికెటర్ అశ్విన్ విజ్ఞప్తి
భారత క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఒక విజ్ఞప్తి చేశాడు. తన ఇంట్లో విద్యుత్ ప్రసారంలో ఇబ్బంది కల్గుతోందని, కేవలం తన ఇంట్లోనే కాకుండా వీధి మొత్తం ఇదే పరిస్థితి నెలకొందంటూ ఒక ట్వీట్ చేశాడు. గత పది సంవత్సరాలుగా తమ వీధిలో ట్రాన్స్ ఫార్మర్ లేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును తాను సకాలంలో కడుతున్నానని తెలిపాడు. ఈ సమస్య పరిష్కారానికి గాను ఒక ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని ఆ ట్వీట్ లో తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.