: టీడీపీ అంగీకారంతోనే ప్యాకేజీ ఇచ్చాము: ఎంపీ హరిబాబు


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు అన్ని పార్టీలు అంగీకరించిన తరువాతే అప్పట్లో రాష్ట్ర విభజన జరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు గుర్తుచేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ మిత్రపక్షం టీడీపీ అంగీకారంతోనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని అన్నారు. ప్రజలు, ఆందోళనకారులు, విమర్శకులు, టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్యాకేజీని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర స్థాయి నాయకులు వచ్చి ప్యాకేజీ గురించి వివరిస్తారని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేటాయించడాన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News