: పవన్ కల్యాణ్ అంటే అభిమానమే...ఆయన మాటతీరు మాత్రం బాధ కలిగిస్తోంది: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు


సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తమకు చాలా అభిమానమని ఏపీ బీజేపీ సీఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మాటతీరు మాత్రం బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రజల సెంటిమెంటు కంటే రాష్ట్రాభివృద్ధికే ప్రాధాన్యతనిస్తానని ఆయన తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. రైల్వే జోన్ విశాఖపట్టణానికే వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News