: రాష్ట్రంలో 'ప్రత్యేక' నిరసనల నేపథ్యంలో... ఏపీ బీజేపీ కేబినెట్ మంత్రులకు ఢిల్లీ పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదాపై సెంటిమెంట్ బలం పుంజుకుంటుండడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వేగంగా స్పందించింది. దీంతో ఏపీ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న తమ పార్టీ నేతలను రేపు ఉదయాన్నే ఢిల్లీ రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. దీంతో రేపు ఏపీ బీజేపీ మంత్రులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకహోదా ప్రకటించకపోవడంతో బీజేపీని రాష్ట్ర పార్టీలన్నీ దోషిగా చేస్తుండడంతో ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలా? అని రేపటి సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.