: ఎంపీ టీజీ వెంకటేశ్ పై పవన్ విమర్శనాస్త్రాలు
ఎంపీ టీజీ వెంకటేశ్ పై పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. కర్నూల్ లో తన పరిశ్రమలతో ఆయన వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లారని, టీడీపీకి జనసేన పార్టీ మద్దతు ఇచ్చిందని అన్నారు. జనసేన పార్టీ వదిలేసిన సీటులో రాజ్యసభలో టీజీ వెంకటేశ్ కూర్చున్నారన్నారు. తాను రాజకీయ డ్రామాలు చేయనని, చేయాలనుకుంటే తాడోపేడో తేల్చుకుంటానని హెచ్చరించారు. రాష్ట్ర విభజన వద్దన్న సీపీఎంకు తాను దాసోహమయ్యానని, పోరాటాలు, బంద్ లకు వెళ్లి యువకుల భవిష్యత్ పాడు చేసుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.