: ఎక్కడి నుంచో వచ్చి ముంబై పరువు గంగలో కలుపుతున్నాడు: కపిల్ శర్మపై మండిపడ్డ శివసేన


హిందీ టెలివిజన్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మపై శివసేన మండిపడింది. ఎక్కడి (పంజాబ్) నుంచో వచ్చి, ఇక్కడి (ముంబై) పరువు గంగలో కలుపుతున్నాడని శివసేన నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నాడని ఆయన మండిపడ్డారు. మరోపక్క, బీఎంసీ (బృహన్ ముంబై కార్పొరేషన్) అధికారుల్లో ఎవరు 5 లక్షల రూపాయల లంచం తీసుకున్నారో చెప్పాలని తాము కోరినా కపిల్ శర్మ వెల్లడించలేదని బీఎంసీ విజిలెన్స్ శాఖ చీఫ్ ఇంజనీర్ మనోహర్ పవార్ తెలిపారు. ఆయన పేరు వెల్లడిస్తే విచారించి, కఠిన చర్యలు తీసుకునే వీలుంటుందని ఆయన చెప్పారు. కాగా, నేటి ఉదయం ట్విట్టర్ లో కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News