: ఆంధ్రా నాయకులను ‘దద్దమ్మల్లారా’, ‘సన్నాసుల్లారా’ అంటుంటే నాకు బాధ కల్గింది: పవన్


ఆంధ్రానాయకులను దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా.. అని తెలంగాణ నాయకులు తిడుతుంటే తనకు బాధ కల్గిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వాపోయారు. ‘తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకులను ‘సన్నాసి’ అంటే.. ‘ఏమండీ, ఇది పద్ధతి కాదు’ అని సీమాంధ్ర నాయకులు అంటారు. ‘చవటల్లరా’ అంటే, ‘అలాంటి మాటలు మేమూ మాట్లాడొచ్చు, కానీ, మేము మాట్లాడము’ అని సీమాంధ్ర నాయకులు అంటారు’ అని పవన్ అన్నారు. ఈ విధంగా వారు తిడుతున్న సందర్భాలను చూస్తుంటే తనకు చాలా బాధ వేసేదని, కనీసం, మన నాయకులు ‘ఎందుకు తిడుతున్నావు?’ అని ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా, సీమాంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే వారిని తొట్టొద్దని కాంగ్రెస్, టీడీపీ... అసలు ఏ పార్టీకి చెందిన నాయకులైనా కనీసం ఒక్కరన్నా ప్రశ్నించారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అందుకనే, సీమాంధ్ర ప్రాంత ఎంపీలంటే ఢిల్లీలో చాలా చులకనై పోయారని, వారిని బయటకు పంపించిమరీ రాష్ట్రాన్ని విడగొట్టారని, ఇదంతా చూసి తనకు ఏడుపొచ్చిందని పవన్ అన్నారు.

  • Loading...

More Telugu News