: వెంకయ్యనాయుడిపై రాళ్లు విసిరిన చరిత్ర మంద కృష్ణ మాదిగది: పిడమర్తి రవి
వెంకయ్యనాయుడిపై రాళ్లు రువ్విన చరిత్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగదని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని అంబేద్కర్ తో పోల్చడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేయకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. నవంబర్ 13వ తేదీన నిజాం కాలేజ్ గ్రౌండ్ లో మాదిగల శక్తి ప్రదర్శన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.