: అంతా పవన్ ఫీవర్... నిండిపోయిన 'ఆత్మగౌరవ' ప్రాంగణం!
పవన్ కల్యాణ్ బహిరంగ సభకు సమయమొచ్చింది. కాకినాడలోని జేఎన్టీయూ మైదానం వేదికగా, ఆయన మరికాసేపట్లో ప్రసంగించనుండగా, మైదానం మొత్తం ఆయన అభిమానులతో నిండిపోయింది. 'పవర్ స్టార్ జిందాబాద్', 'ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే' అన్న నినాదాలతో సభా వేదిక హోరెత్తుతోంది. గత రాత్రే కాకినాడకు చేరుకున్న పవన్ కల్యాణ్ సరిగ్గా 3:50 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ సభ నిర్వహించుకునేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వగా, సమయానికి సభ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ఏం మాట్లాడతారో మరికాసేపట్లో తెలిసిపోనుంది.