: భార్యపై రేప్ కేసు వేసిన భర్త... తీర్పు ఆసక్తికరం!
భార్యపై భర్త రేప్ కేసు వేసిన ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. శృంగారం కోసం తన భార్య తనను నిర్బంధించి బలవంతం చేసిందని కిమ్ అనే వ్యక్తి సియోల్ లోని సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేశారు. కిమ్, అతని భార్య షిమ్ వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. జీవిత భాగస్వామితో బలవంతపు శృంగారం సరికాదని షిమ్ కు న్యాయస్థానం హితవు పలికింది. భార్యతో సఖ్యంగా మెలగాలని కిమ్ కు సూచించింది. అదే సమయంలో భర్తను 29 గంటలపాటు ఇంట్లో నిర్బంధించి, గాయపరచినందుకుగాను షిమ్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, దక్షిణ కొరియాలో 2013లో భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా గుర్తించింది. ఆ తరువాత ఆ దేశంలో ఇలాంటి ఘటనలో నమోదైన తొలి కేసు ఇదే కావడం విశేషం.