: అనంత‌పురంలో ఇటీవ‌ల వ‌చ్చిన క‌ర‌వు సామాన్య‌మైంది కాదు: స్పీక‌ర్ కోడెల


అనంత‌పురంలో ఇటీవ‌ల వ‌చ్చిన క‌ర‌వు సామాన్య‌మైంది కాదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు అన్నారు. ‘కరవుపై గన్-క్షేత్ర‌స్థాయి నివేదిక’ పుస్త‌కాన్ని హైద‌రాబాద్‌లో ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, స్పీకర్ కోడెల, మంత్రులు చిన‌రాజ‌ప్ప‌, కేఈ కృష్ణ‌మూర్తి, ప్ర‌త్తిపాటి పుల్లారావుతో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కోడెల మాట్లాడుతూ... అనంత‌పురంలో ఏర్ప‌డ్డ క‌ర‌వు ప్ర‌భావం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని అన్నారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో క‌ర‌వును ఎదుర్కోవ‌చ్చ‌ని చెప్పారు. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... పంట‌ కాపాడుకుంటామ‌ని రైతుల‌కు భ‌రోసా వ‌చ్చింద‌ని అన్నారు. వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉన్నా రెయిన్ గ‌న్‌ల ద్వారా పంట‌ను కాపాడుకోవ‌చ్చ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News