: అయోధ్యలో రాహుల్ గాంధీ.. రామజన్మభూమి-బాబ్రి మసీదు స్థలాన్ని సందర్శించకుండానే వెళ్లిన నేత
బాబ్రీమసీదు కూల్చివేసిన ఘటన జరిగినప్పటి నుంచి (1992) ఇప్పటి వరకు అయోధ్యలో పర్యటించని గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ రూపంలో మళ్లీ మొదటిసారిగా ఆ ప్రాంతంలో అడుగు పెట్టింది. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచేలా పర్యటనలు చేస్తూ ఇటీవలే ‘కిసాన్ యాత్ర’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు అయోధ్యలో అడుగుపెట్టారు. తన పర్యటనలో భాగంగా రాహుల్ అక్కడి హనుమాన్ గర్హి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, రామజన్మభూమి-బాబ్రి మసీదు స్థలాన్ని సందర్శించకుండానే అక్కడి నుంచి సైఫాబాద్ వెళ్లారు. 1990లో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హనుమాన్ గర్హి దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు. పలు కారణాల వల్ల ఆయన దర్శించుకోలేకపోయారు.