: మాపై ప్రతిపక్షాలు, మీడియా అపోహ‌లు సృష్టిస్తున్నాయి: బీజేపీ నేత సిద్ధార్థ‌నాథ్‌


త‌మ‌పై ప్రతిపక్ష పార్టీలు, మీడియా అపోహ‌లు సృష్టిస్తున్నాయని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్ అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో అందే సాయం కంటే కేంద్రం ఎక్కువ లాభాల్నే చేకూర్చింద‌ని ఆయ‌న అన్నారు. ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్, వైసీపీలే మోసం చేశాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌త్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు చేర్చ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బీజేపీ-టీడీపీల మ‌ధ్య మిత్ర బంధం కొన‌సాగుతుంద‌ని, 2019త‌రువాత కూడా క‌లిసి ప‌నిచేస్తాయని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News