: అంతా నాటకం, భ్రమే... రూ. 200 కోట్లు కూడా రావు: రఘువీరా నిప్పులు
ఆంధ్రప్రదేశ్ కు రూ. 2.5 లక్షల కోట్లు ప్యాకేజీగా అందుతుందని కేంద్రం ప్రకటించడాన్ని నాటకమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొట్టి పారేశారు. ఈ ఉదయం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం కనీసం రూ. 200 కోట్లు కూడా ఇవ్వదని తేల్చి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజల్లో లేనిపోని భ్రమలను కల్పిస్తున్నారని, వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మబోరని అన్నారు. ప్యాకేజీ పేరుతో డ్రామాలాడుతున్న కేంద్ర వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని తెలిపారు. ప్రజా ఉద్యమం తీవ్ర స్థాయికి రాకముందే హోదాను ప్రకటించాలని డిమాండ్ చేసిన ఆయన, రేపటి బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.