: ‘మెవాత్’ బిర్యానీలో గొడ్డు మాంసం ఉంది.. నిర్ధారించిన ల్యాబ్
హర్యాణాలోని మెవాత్‌లోని హోటళ్ల నుంచి సేకరించిన బిర్యానీ శాంపిళ్లలో గొడ్డు మాంసం (బీఫ్) ఉన్నట్టు వాటిని పరీక్షించిన ల్యాబ్ నిర్ధారించింది. సేకరించిన ఏడు నమూనాల్లోనూ బీఫ్ ఉన్నట్టు తెలిపింది. ఈద్ సందర్భంగా పలు హోటళ్లలో బీఫ్ బిర్యానీ తయారుచేస్తున్నట్టు హర్యాణా గో సేవా ఆయోగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం పోలీసులు ముండకాతోపాటు ఇతర గ్రామాల నుంచి బిర్యానీ శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెటర్నిటీ ల్యాబ్ ఆ శాంపిళ్లలో గొడ్డు మాంసం ఉన్నట్టు తేల్చిచెప్పింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.