: ఏపీ ప్రత్యేక ప్యాకేజీ విలువ రూ.2.29 లక్షల కోట్లట!... సవివరంగా లెక్కలు చెప్పిన వెంకయ్య!


ఏపీకి కేంద్రం ప్రకటించిన స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ విలువ రూ.1.5 లక్షల కోట్లు కాదట. ఆ ప్యాకేజీ విలువ అక్షరాలా రూ.2,29,398 కోట్లని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మేరకు ప్యాకేజీ లెక్కలను సవివరంగా వెల్లడించారు. వెంకయ్య చెప్పిన లెక్కలిలా ఉన్నాయి. అంశం నిధులు (కోట్లలో) పెట్రోలియం ప్రాజెక్టులు - 52,120 జాతీయ రహదారులకు - 65,000 పోలవరం ప్రాజెక్టు - 15,850 విద్యా సంస్థలకు - 5,190 జాతీయ సంస్థలకు - 1,030 రక్షణ సంస్థలకు - 6,266 పట్టణాభివృద్ది, గృహ నిర్మాణం - 4,110 నౌకాయాన ప్రాజెక్టులు - 3,465 ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు - 1,740 విద్యుత్ ప్రాజెక్టులకు - 328 ఎయిర్ పోర్టులకు - 303 రైల్వే ప్రాజెక్టులకు - 3,808 వాణిజ్యం, పరిశ్రమలకు - 3,078 ఐటీ, టెలి కమ్యూనికేషన్లకు - 357 పర్యాటక రంగానికి - 131 ఇతరత్రా - 102 మొత్తం - 1,62,878 (పైవన్నీ ఇప్పటిదాకా చేపట్టిన పనులకు సంబంధించిన కేటాయింపులు) ఇక కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల వివరాలిలా ఉన్నాయి. ఆర్ఐఎన్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్ - 38,500 విశాఖలో మెడ్ టెక్ పార్కుకు - 20,000 అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం - 7,500 ఏపీ ట్రాన్స్ మిషన్ కారిడార్ నిర్మాణానికి - 520 మొత్తం - 66,520 ఇప్పటిదాకా చేపట్టిన ప్రాజెక్టులకు 1,62,878 కోట్లు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు ఇవ్వనున్న రూ.66,520 కోట్లు మొత్తం కలుపుకుని రూ.2,29,398 కోట్లని వెంకయ్య లెక్కలు చెప్పారు.

  • Loading...

More Telugu News