: పొరుగు దేశాన్ని నియంత్రించే సమయం ఆసన్నమైంది: న‌రేంద్ర మోదీ


లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో నిర్వహిస్తోన్న 14వ ఆసియాన్‌-ఇండియా సదస్సులో ఈరోజు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పాల్గొన్నారు. స‌ద‌స్సుకు అమెరికా, చైనా అధ్యక్షులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో మోదీ మాట్లాడుతూ... పాకిస్థాన్ తీరుని మ‌రోసారి ఎండ‌గ‌ట్టారు. ఓ పొరుగు దేశం టెర్ర‌రిజాన్ని తయారు చేసి, దాన్ని రవాణా చేస్తోంద‌ని ఆయ‌న పరోక్షంగా పాక్ పై మండిపడ్డారు. ఆ దేశం ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ దేశాల‌ మధ్య అశాంతి నెల‌కొలిపి, హింసను ప్రేరేపిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న ఆ దేశాన్ని నియంత్రించే సమయం ఆసన్నమైందని ఆయ‌న అన్నారు. ఆసియా దేశాల ఐక్యత కొన‌సాగ‌డానికి, అభివృద్ధికి ఇండియా కృషిని కొన‌సాగిస్తుంద‌ని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News