: ‘తలైవా’ ఆశీస్సులు తీసుకున్నా: కొరియో గ్రాఫర్ రాఘవ లారెన్స్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు లారెన్స్ కలిశాడు. తన తర్వాతి చిత్రం ‘శివలింగం’ చిత్రం కోసం తలైవా ఆశీస్సులు తీసుకున్నానని లారెన్స్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. నిన్న రజనీని కలిశానని, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని అన్నాడు. తన తల్లికి గుడి నిర్మించడంపై రజనీ తనను అభినందించారని చెప్పిన లారెన్స్, ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.