: ఏపీకి ఆర్థిక సాయంపై కేంద్రం అధికారిక ప్రకటన విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం ఈరోజు ఆమేరకు అధికారిక ప్రకటన చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ pib.nic.in లో దానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది. నాలుగు కేటగిరీల కింద ఏపీకి ప్రత్యేక సాయం అందించనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, 1-12-15 రిపోర్ట్ ఆన్ డెవలప్ మెంట్ సపోర్ట్ టు ఆంధ్రప్రదేశ్ కేటగిరీల కింద సాయం అందించనున్నట్లు పేర్కొంది.