: తల్లి ఇచ్చిన బహుమతిని భద్రంగా దాచుకున్న ఏ.ఆర్.రెహమాన్
జీవితంలో కొన్ని బహుమతులను తీపి జ్ఞాపకాలుగా దాచిపెట్టుకుంటాం. కొందరు ఇచ్చిన వస్తువులనయితే జీవితాంతం భద్రంగా కాపాడుకుంటాం. ప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ కూడా తన తల్లి కరీమా బేగం ఇచ్చిన బహుమతిని ఎంతో అపురూపంగా దాచిపెట్టుకున్నారట. తన తల్లిపై ఎనలేని ప్రేమను కనబరిచే ఏ.ఆర్.రెహమాన్‌కు ఆయన తల్లి కరీమా బేగం 1986 ఓ అంబాసిడర్ కారును బహుమతిగా ఇచ్చారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా సోషల్‌మీడియా సైట్ ఫేస్‌బుక్ ద్వారా తన అభిమానులకు తెలిపారు. ఆ కారుని తన ఇంటి వద్ద పెరట్లో భద్రంగా దాచుకున్నట్లు పేర్కొన్నారు. ఆ కారు ఫోటోను కూడా రెహ్మాన్ పోస్ట్ చేశారు.