: సినిమా చూస్తూ, ఫోన్లలో రివ్యూలేంటి? కొత్త చిత్రాలు చేయాలంటే ఆసక్తి పోతోంది: హీరో సిద్ధార్థ అసహనం
ఓ వైపు సినిమా చూస్తూ, మరోవైపు స్మార్ట్ ఫోన్ నుంచి అసంబద్ధ ట్వీట్ రివ్యూలు పెట్టడంపై హీరో సిద్ధార్థ నిప్పులు చెరిగాడు. హాల్లో సినిమా చూస్తూ, స్టుపిడ్ ఫోన్ పై మనసు పెట్టడం ఏ మేరకు మంచిదన్నది రివ్యూలిచ్చే వారే ఆలోచించుకోవాలని అన్నాడు. ఇండియాలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలనూ పీడిస్తున్న సమస్యగా ఇది మారిందని తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశాడు. పైరసీతో పాటు సినిమా విశ్లేషణలు సినీ మార్కెట్ ను దెబ్బతీస్తున్నాయని ఆరోపించాడు. దీనివల్ల కొత్త సినిమాల్లో నటించాలన్న ఆసక్తి చచ్చిపోతోందని చెప్పుకొచ్చాడు. సినిమా చూస్తూనే విమర్శలు గుప్పించడం తగదని హితవు పలికే ప్రయత్నం చేశాడు.