: మళ్లీ ప్రారంభమైన అసెంబ్లీ... సభలో గందరగోళం


శాసనసభ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైంది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరే నిలబడి తమ నిరసన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారి నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. అయితే, స్పీకర్ అవేమీ పట్టించుకోకుండా తన ప్రొసీడింగ్స్ ను కొనసాగిస్తున్నారు. సభా నాయకుడు, సీఎం చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ బిల్లుపై ప్రసంగం ప్రారంభించారు. జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News