: నవజ్యోత్ సిద్ధు కొత్త పార్టీ ప్రకటన నేడే


బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ క్రికెటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు సొంతంగా 'ఆవాజ్-ఇ-పంజాబ్' పేరుతో పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై గురువారం చండీగఢ్ లో ఆయన లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో సిద్ధు పార్టీ పోటీ చేయనుంది. సిద్ధు ఇప్పటికే తన పార్టీ పేరును ఆన్ లైన్ వేదికగా ప్రకటించేశారు. అయితే, దీనిపై ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తన పార్టీ గురించి లాంఛనంగా ప్రకటన చేయడంతోపాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. సిద్ధు నూతన పార్టీలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్, అధికార శిరోమణి అకాలీదళ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే తదితరులు భాగం కానున్నారు.

  • Loading...

More Telugu News