: వాయిదాల పర్వం షురూ!... ఏపీ అసెంబ్లీ 10 నిమిషాల పాటు వాయిదా!


కాసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాయిదాల పర్వం మొదలైంది. సభ ప్రారంభం కాగానే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతించాలంటూ విపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ ససేమిరా అనడంతో వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు చేతబట్టి ప్రత్యేక హోదా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎన్నిసార్లు విన్నవించినా విపక్ష సభ్యులు వినకపోవడంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News