: రైట్ ఉమన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ!... గంగా భవానీపై బీజేపీ యువనేత ఆసక్తికర వ్యాఖ్య!
కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ కీలక నేత గంగా భవానీపై బీజేపీకి చెందిన యువనేత విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్ నేటి ఉదయం నిర్వహించిన లైవ్ డిబేట్ లో భాగంగా ఏపీకి జరిగిన అన్యాయంపై వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ సర్కారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్న గంగా భవానీ వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని హత్య చేసిన కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీని విమర్శించే అర్హతే లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గంగా భవానీని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘ద్రోహుల పార్టీలో మీరెందుకు ఉంటారు? తక్షణమే బయటకు వచ్చేయండి. మంచి ఆలోచనలు చేసే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండటమేమీ బాగాలేదు. రైట్ ఉమన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.