: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి మళ్లీ అస్వస్థత
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో ఈరోజు ఉదయం నిర్వహించిన చాతుర్మాస దీక్షా సమయంలో శ్వాస తీసుకునేందుకు ఆయన ఇబ్బందిపడ్డారు. వెంటనే, ఆయన్ను ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ టి. రవీంద్రనాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జయేంద్ర సరస్వతి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో న్యూమోనియాగా మారిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తితే కనుక వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తామన్నారు.