: 2011 గ్రూప్ -1 మెయిన్స్ జనరల్ ఇంగ్లీషు పరీక్ష వాయిదా


ఈనెల 13న జరగాల్సిన 2011 గ్రూపు-1 మెయిన్స్ (రీఎగ్జామ్) జనరల్ ఇంగ్లీషు పరీక్షను వాయిదా వేశారు. బక్రీద్ పండగను పురస్కరించుకుని ఈ పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చిందని టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను తిరిగి 24వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు ముందు ప్రకటించిన ప్రకారమే యథాతథంగా జరుగుతాయని, ఈ పరీక్షలను ఒక్క హైదరాబాద్ కేంద్రంలోనే నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించినట్లు తెలిపారు. జనరల్ ఇంగ్లీషు మినహా మిగతా పరీక్షలను ఇంగ్లీషు లేదా తెలుగు లేదా ఉర్దూ భాషల్లో రాయవచ్చని పేర్కొన్నారు. అయితే, ఒక పేపరులో కొంత భాగం ఒక భాషలో .. మరికొంత భాగం వేరే భాషలోనూ రాస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరగదన్నారు. హాల్ టికెట్లను ఈరోజు అర్ధరాత్రి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు ఆ ప్రకటనలో సూచించారు.

  • Loading...

More Telugu News