: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెన్ హిగ్స్ మృతి


ఇంగ్లాండ్ కు చెందిన మాజీ క్రికెటర్, కుడి చేతి వాటం పేస్ బౌలర్ కెన్ హిగ్స్ (79) ఈరోజు మృతి చెందాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ (1965 ఆగస్టు)తో హిగ్స్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు. తొలి మ్యాచ్ లోనే 8 వికెట్లు పడగొట్టిన ఘనత హిగ్స్ ది. ఇంగ్లాండ్ జట్టులోకి ఆలస్యంగా ప్రవేశించిన హిగ్స్ తన కెరీర్ లో 15 టెస్టు మ్యాచ్ లు 71 వికెట్లు తీసుకున్నాడు. అయితే, బ్యాటింగ్ లో మాత్రం హిగ్స్ దారుణంగా విఫలమయ్యాడు. తన కెరీర్ లో కేవలం 185 పరుగులు మాత్రమే చేయగా, అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. హిగ్స్ జట్టులోకి ప్రవేశించిన మూడేళ్లలోపే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. హిగ్స్ కు ఫుట్ బాల్ క్రీడాకారుడిగానూ మంచి గుర్తింపు పొందాడు.

  • Loading...

More Telugu News