: ఢిల్లీకి రానని చెప్పిన సీఎం చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై ఢిల్లీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ నేతృత్వంలో అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళతారని భావించారు. అయితే, రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాను ఢిల్లీకి రావడం లేదంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ లకు బాబు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి వారు తెలిపారు. దీంతో చంద్రబాబు లేకుండానే ఏపీకి ప్రత్యేక్ ప్యాకేజ్ పై ఒక ప్రకటన వెలువడే అవకాశముంది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై స్పష్టత నిచ్చేందుకు మరికొద్ది సేపట్లో అరుణ్ జైట్లీ మీడియా ముందుకు రానున్నారు.

  • Loading...

More Telugu News