: అలా అయితే, రైల్వే జోన్ విషయంలో ఏపీ విజయం సాధించినట్టు... విశాఖ ఓడిపోయినట్టు!: ఎంపీ హరిబాబు కామెంట్


ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ వస్తుందని అన్నారు. అయితే అది విశాఖపట్టణానికేనని తాము భావిస్తున్నామని, అలా కాకుండా విజయవాడకు రైల్వే జోన్ కేటాయిస్తే...రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించినట్టు, విశాఖపట్టణం ఓడిపోయినట్టుగా భావిస్తామని ఆయన తెలిపారు. అంతిమంగా రాష్ట్రానికి న్యాయం జరగడమే తమకు కావాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News