: కొత్త జిల్లాలకు నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వచ్చే దసరా నుంచే కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వాధికారులతో కేసీఆర్ దీనికి సంబంధించిన నివేదికలను తెప్పించుకొని, పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాలకు నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి కొత్త జిల్లాలకు నిధులను విడుదల చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి చొప్పున విడుదలయ్యాయి. అయితే అందులోంచి హైదరాబాద్‌ను మినహాయించారు.