: అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తీరును ఎండగడతాము: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు


అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు తీరును ఎండగడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి అన్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 36 అంశాలపై చర్చించాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన సమయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా, ఓటుకు నోటు, రాజధాని భూ కుంభ కోణాలు, కరవు నివారణా చర్యల్లో వైఫల్యం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అంశాలపై చర్చించే నిమిత్తం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News