: నయీమ్ లైంగికంగా వేధించేవాడు.. మాట వినకపోతే మిరప రసం తాగించి కొట్టేవాడు: నయీమ్ బాధిత బాలికల వాంగ్మూలం
చేసిన పాపాలు పండడంతో ఇటీవల తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఇంట్లోని బాలికలను సాక్షులుగా పేర్కొన్న పోలీసులు ఈరోజు వారి వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు. తనకు పెళ్లి చేస్తానని చెప్పి నయీమ్ అత్త సుల్తానా తనను ఆరేళ్ల క్రితం నయీమ్ వద్దకు తీసుకొచ్చినట్లు ఓ బాలిక తెలిపింది. నయీమ్ తరుచూ లైంగికంగా వేధించేవాడని, తమపై పలుసార్లు అత్యాచారం చేశాడని నయీమ్ బాధిత బాలికలు పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని ట్యాబ్లెట్లను వేసేవాడని చెప్పారు. నయీమ్ అనుచరులు సుల్తానా, సాహెరా, సలీమా, ఫయీమ్ కూడా తమను ఎన్నో బాధలకు గురిచేసేవారని చెప్పారు. ఎదురు చెప్పినందుకు ఓ బాలికను నయీమ్ హత్య చేశాడని వారు పేర్కొన్నారు. మాట వినకపోతే నయీమ్ మిరప రసం తాగించి కొట్టేవాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు.