: పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవం.. విజయవాడకు రైల్వేజోన్ తరలబోదు: సుబ్బరామిరెడ్డి
విశాఖ కేంద్రంగా కాకుండా విజయవాడ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందంటూ వస్తోన్న వార్తలపై రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి స్పందించారు. రైల్వేజోన్ విజయవాడకు తరలబోదని ఆయన అన్నారు. పత్రికల్లో వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. రైల్వేజోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమని ఆయన అన్నారు. ఈ అంశంపై స్పందించవలసిందిగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతామని సుబ్బరామిరెడ్డి చెప్పారు. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు ఏపీ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన గుర్తు చేశారు. సురేష్‌ప్రభును రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పిస్తారని ఆయన పేర్కొన్నారు.