: అరెస్టులకు భయపడేది లేదు... భూమనను అరెస్ట్ చేస్తే న్యాయ పోరాటమేనన్న అంబటి


తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణార్ రెడ్డి వరుసగా రెండో రోజు కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం వచ్చిన ఆయన వెంట పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అంబటి రాంబాబు అక్కడికి వచ్చారు. భూమన సీఐడీ కార్యాలయం లోపలికి వెళ్లిన తర్వాత అంబటి రాంబాబు అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండో రోజు సీఐడీ అదికారులు విచారణకు పిలిచిన నేపథ్యంలో భూమన అరెస్టవుతారంటూ వదంతులు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నాయి. అయితే తాము మాత్రం అలా భావించడం లేదని, ఒకవేళ భూమన అరెస్టైనా తాము భయపడేదేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. భూమన అరెస్టైతే న్యాయపోరాటం సాగిస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News