: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో బీభత్సం సృష్టించిన హ్యుందాయ్ కారు
సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్‌కి సమీపంలో ఈరోజు తెల్లవారుజామున అదుపుతప్పిన ఓ కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చి బీభత్సం సృష్టించింది. అక్కడ ఉన్న చెరకు బండి, టీస్టాల్, పాన్ డబ్బాలపైకి దూసుకుపోయింది. చివరకు అక్కడ ఉన్న ప్రహరీ గోడను ఢీ కొని ఆగిపోయింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో కారు అదుపుతప్పి దూసుకురావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హ్యుందాయ్ ఐ-20 కారులో ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుంచి తార్నాక-ఉప్పల్ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కారులోని వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.