: మూడు రోజులు కాదు, మూడు వారాలు కావాలి!... అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ పట్టు!
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కూడా. అయితే మూడు రోజుల సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంపైన చర్చ పూర్తి కాదని చెబుతున్న విపక్షం వైసీపీ... సమావేశాలను మూడు వారాలకు పొడిగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యూహంపై చర్చించనున్న ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలను మూడు వారాలకు పొడిగించాలన్న అంశంపై తీర్మానం జరగనుంది.