: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యత మాదే!... అయితే నిధులిప్పుడే ఇవ్వబోం!: రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు


ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయంలో కేంద్రం ప్రభుత్వంలో నేటి ఉదయం కీలక చర్చలకు తెర లేచింది. నేటి ఉదయం తన అధికారిక నివాసానికి వచ్చిన సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ లతో చర్చలు జరిపిన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం భాధ్యతను పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే నేడు ప్రకటించనున్న స్పెషన్ డెవలప్ మెంట్ ప్యాకేజీలో రాజధానికిచ్చే నిధుల ప్రస్తావన ఉండబోదని కూడా ఆయన తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మించనున్న భవనాల డీపీఆర్ లు అందజేసిన తర్వాత మాత్రమే సదరు నిధులను మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాజధానిలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాల నిర్మాణ బాధ్యతలన్నీ తామే తీసుకుంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కూడా ఆయన సుజనా, రమేశ్ లకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News