: సింహాచలంలో అపచారం!... వినాయకచవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు!


విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయానికి దారి తీసే దారిలో ఆలయానికి అత్యంత సమీపంగా వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకుంది. మద్యం మత్తు తలకెక్కిన కొందరు యువకులు ఓ మహిళా డ్యాన్సర్ తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. పోలీసులు అల్లంత దూరంలో ఉండగానే ఈ అశ్లీల నృత్యాలు జరగడం విశేషం. దీనిపై మీడియాలో వరుస కథనాలు రాగా.. విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ వేగంగా స్పందించారు. సింహాచలంలో వినాయకచవితి భద్రతా విధుల్లో ఉన్న ఏసీపీ భీమారావు, సీఐ బాలసూర్యారావులపై ఆయన కొరడా ఝుళిపించారు. వారిద్దరిని కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు కమిషనర్ యోగానంద్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News