: రికార్డు సృష్టించిన మాజీ ప్రధాని వాజ్‌పేయి.. అత్యధిక పథకాలకు ఆయన పేరు


భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జీవించి ఉండగానే అత్యధిక ప్రభుత్వ పథకాలకు ఆయన పేరును పెట్టడంతో ఈ అరుదైన ఘనత సొంతమైంది. 2014లో నరేంద్రమోదీ ప్రధాని పగ్గాలు చేపట్టాక పలు సంక్షేమ పథకాలకు వాజ్‌పేయి పేరు పెట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చాలా పథకాలకు అటల్ పేరుంది. ఈ విషయంలో మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను వాజ్‌పేయి వెనక్కి నెట్టేశారు. ఇప్పటికే అమలులో ఉన్న అనేక పథకాలకు కేంద్రం ‘అటల్’ అన్న పదం చేర్చింది. అలాగే రాజస్థాన్ ప్రభుత్వం 9వేల గ్రామ పంచాయతీ కేంద్రాలకు అటల్ సేవా, సువిధ కేంద్రాలుగా పేరు పెట్టింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా పలు పథకాలకు అటల్ పేరు పెట్టింది. మచ్చలేని నాయకుడిగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వాజ్‌పేయి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డిసెంబరు 25న ఆయన జన్మదినం సందర్భంగా కేంద్రం ఆ రోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News